తొలి శుభోదయం న్యూస్ యర్రగొండపాలెం:-
యర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో నిర్వహించిన “జాతీయ పల్స్ పోలియో” కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హాస్పిటల్‌లో చిన్నార్లకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వారి భవిష్యత్తుకు రక్షణ కల్పించాలన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్క చిన్నారికి ఈ చుక్కలు అందేలా వైద్య సిబ్బంది, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది మరియు వైస్సార్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.