తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు:-
పొన్నలూరు మండలం, చెన్నిపాడు గ్రామం నందు… వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నలూరు మండల MPP శ్రీ కొండాబత్తిన మాధవరావు గారి తండ్రి గారైన… శ్రీ కొండాబత్తిన చిన మాల కొండయ్య గారు నిన్న తేది. 29/06/2026 సోమవారం మరణించిన విషయం స్థానిక నాయకులు ద్వారా తెలియగా… మంగళవారం వారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి సంతాపం తెలియజేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి పరామర్శించిన… మాజీ మంత్రివర్యులు, పార్టీ PAC సభ్యులు, కొండపి నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ శ్రీ ఆదిమూలపు సురేష్… వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC )సభ్యులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య . ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు కీ.శే. చిన మాలకొండయ్య గారి మృతికి సంతాపం తెలియజేశారు.