తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం : –
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి బుధవారం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలోని పలు ప్రజా సమస్యలు ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.