మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం : –
రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సంబంధిత అధికారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై సంబంధిత అధికారులతో బుధవారం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదాలు జరిగే బ్లాక్స్ స్పాట్ ప్రాంతాల్లో సూచిక బోర్డులు, భారీ కేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. రైజ్ కాలేజీ, బాపూజీ కాలనీ, జరుగుమల్లి అడ్డ రోడ్డు, శానంపూడి వద్ద తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు.