తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
తాళ్లూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూతనంగా మంజూరైన 9 మంది లబ్ధిదారులకు స్పౌజ్ పింఛన్లను దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో తాళ్లూరు మండల ఎంపీడీఓ పి. అజిత, తహసీల్దార్ రమణారావు, నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు రాఘవేంద్ర గారు, మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి గారు, స్థానిక నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.నూతనంగా మంజూరైన స్పౌజ్ పింఛన్ లబ్ధిదారులు:
కిలారి విజయలక్ష్మి (అయ్యలపాలెం), పులిపాటి సునీత (కొర్రపాటివారిపాలెం), నారిపెద్ది సుబ్బయమ్మ (శివరామపురం), మేడగం వెంకటసుబ్బమ్మ (విఠలాపురం), గర్నిపూడి రాములు (లక్కవరం), వంగపల్లి కోటేశ్వరమ్మ (రాజానగరం), మండాది వెంకటనారాయణ (మల్కాపురం), ఎస్.కే. ఖాసీంబి (మల్కాపురం), ఆలూరి మార్తమ్మ (వెలుగువారపాలెం).ప్రతి లబ్ధిదారుకు నెలకు రూ.4,000 చొప్పున స్పౌజ్ పింఛన్‌ను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు తమ చేతుల మీదుగా అందజేసి, కూటమి ప్రభుత్వం సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు.