రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధిక ప్రాధాన్య ఇస్తున్నారని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
లింగసముద్రం పంచాయతీలోని రామకృష్ణాపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు స్వయంగా పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందించారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పింఛన్ల రూపంలో లింగసముద్రం మండలంలో ప్రతినెలా 5133 మంది లబ్ధిదారులకు 2.25 కోట్ల రూపాయలు అందజేస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధితోపాటు సంక్షేమం కూడా ఘనంగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం కేవలం ఆరకొర సంక్షేమ పథకాలు అమలుచేసి, అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు ఎమ్మెల్యే గారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, మండల టిడిపి అధ్యక్షులు పూరిమిట్ల గురునాథం, గ్రామ పార్టీ అధ్యక్షుడు గాలంకి ప్రసాద్, క్లస్టర్ ఇంచార్జ్ వంకాయలపాటి మాల్యాద్రి, పార్టీ నాయకులు అడపా రంగయ్య, చిరుతోటి బాలకోటయ్య, పూరిమిట్ల బాలకోటయ్య, సోంపల్లి మనోహర్, అర్ధాకుల చినసత్యం, పెద్దసత్యం, ఎలిపాటి పుల్లయ్య, బొజ్జా శ్రీనివాసులు, కిలారి రమణయ్య, దేవకి సుబ్రహ్మణ్యం, అడపా నరసయ్య, కమ్మిశెట్టి సుబ్బరాయుడు, బింకం శేషయ్య, జంపాల శివ, కిష్టయ్య, శ్రీను, చెంబేటి మాల్యాద్రి, బొచ్చు మాల్యాద్రి, చప్పిడి కొండలు, మనోజ్, రమణయ్య, రామకేశవులు, హనుమంతు, అన్ని గ్రామాల నాయకులు పాల్గొన్నారు