తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
తాళ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు జవాబుదారీగా వ్యవహరించాలని, ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా తక్షణ పరిష్కారం అందించాలని సూచించారు. రెవెన్యూ సమస్యలు, పొలం పాస్‌బుక్స్, సర్వేలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.అనంతరం రీ-సర్వే ద్వారా నూతనంగా మంజూరైన రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.