google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టిన వీబీ జీ రామ్ జీ (VB-GRAMJEE) (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్) పధకం రాష్ట్రంలో రేపటి అమలు చేయనున్న నేపథ్యంలో సంబంధిత అధికారులతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సమావేశం నిర్వహించారు. తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో బుధవారం జిల్లా డ్వామా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించి జిల్లాలో వీబీ జీ రామ్ జీ అమలుపై చర్చించారు. పాత ఉపాధి హామీ పథకంలో ఉన్న 100 రోజుల పనిని, వీబీ జీ రామ్ జీ కింద 125 రోజులకు పెంచడం శుభ పరిణామం అన్నారు. 125 రోజులు పని దినాలు ప్రజలు వినియోగించుకునేలా చూడాలన్నారు. వీబీ జీ రామ్ జీ కింద అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందించి గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి పేదలకు మేలు జరిగేలా కృషి చేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *