google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేందుకు మార్కాపురం జిల్లా పోలీసులు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసులు ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాలు, వ్యాపార కూడళ్లు, బస్ స్టాండ్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర పాదయాత్రలు, మొబైల్ పహారా, వాహన తనిఖీలు నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు.చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలను ముందుగానే అరికట్టేలా అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారు. ప్రజల సహకారంతో నేరరహిత, సురక్షిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా నిరంతరం కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *