జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు,సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు చెడు నడత కలిగిన వ్యక్తులకు ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ప్రజల్లో భయాందోళనలు కలిగించే చర్యలకు పాల్పడవద్దని, శాంతియుత జీవనం గడపాలని సూచించారు. మళ్లీ నేరాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కుటుంబ సభ్యుల బాధ్యతలను గుర్తించి, సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని, యువతకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇటువంటి కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *