ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , ప్రకాశం పోలీసులు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలపై నేరాల నివారణ, శక్తి యాప్ (SHAKTI App) డౌన్‌లోడ్ మరియు వినియోగం, పోక్సో (POCSO) చట్టం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, బాలలపై నేరాల నివారణ, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేదికల ప్రభావం, ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టం, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.మహిళలు, బాలికలు అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ ద్వారా తక్షణ సహాయం పొందే విధానం గురించి వివరించారు. విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్ భావనను సులభంగా అర్థమయ్యేలా వివరించి, ఎలాంటి అనుచిత ప్రవర్తన జరిగినా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.అలాగే పోక్సో చట్టం ద్వారా బాలల హక్కులకు కల్పించిన రక్షణ, సైబర్ మోసాల నుంచి ఎలా జాగ్రత్తపడాలి, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించడం, మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకుని బాధ్యతగల పౌరులుగా ఎదగాలని, మహిళలు మరియు బాలల భద్రత కోసం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *