మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ పంచాయతీలోని అంకాలమ్మ పల్లె గ్రామానికి చెందిన నల్లగుంట్ల అంకాలయ్య ప్రమాదవశాత్తు బలంగా కిందపడడంతో తుంటి ఎముక విరిగిన విషయం అందరికీ తెలిసినదే నరకం అనుభవించాడు అంకాలయ్య కష్టాలు భాదలు ఎవరికి రావు మానవులందరికీ వస్తాయి . వాటన్నిటిని ఎంతోమంది చూస్తూ ఉంటారు కానీ బి యస్ నారాయణరెడ్డి వినూత్నంగా ఆలోచించి అంకాలయ్యకు సేవ చేయడానికి నేను సైతం అని ముందుకొచ్చాడు అప్పుడు గ్రామస్తుల మనసు మారింది గ్రామానికి చెందిన టిడిపి యువ నాయకుడు మరిబోయిన చంద్రశేఖర్, బి తిరుపాల్ ప్రభుత్వ టీచర్ వారు వారి స్నేహితుల ఆర్థిక సహాయ సహకారాలతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ వారి ద్వారా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరిశీలించిన తర్వాత ఆపరేషన్ చేయాలని సూచించారు. ప్రభుత్వ వైద్యుల ద్వారా తుంటి ఎముకకు ఆపరేషన్ చేపించి పది రోజులపాటు అంకాలయ్యకు సేవలు అందించడం మానవసేవే మాధవ సేవ అని బి యస్ నారాయణరెడ్డి తెలిపారు. అంకాలయ్య కు వంట మాస్టర్ గా మంచి పేరు ఉందన్నారు. రేపటి రోజు తిరిగి ఆయన వంట మాస్టర్ గా తను బతుకుతూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తాడనే ఆశతో ఆయనకు దాతలు సహాయంతో అంకాలయ్యకు సేవలు అందించడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఎందుకంటే ఏమీ లేని అనాధకు సేవ చేయడం మాధవసేవే మాదవసేవ అనే పదానికి నిదర్శనం అని తెలిపారు వైద్యులు చాలా జాగ్రత్తగా ఆపరేషన్ చేసినందుకు అలాగే కింద స్టాప్ నర్సులు అక్కడ ఉన్న ఆయాలు అందరూ మంచి సేవలు అందించారని బి యస్ నారాయణరెడ్డి కొనియాడారు ఈరోజు అంకాలయ్యను వారి దూరపు బంధువైన నల్లగుంట్ల శ్రీరాములు బి తిరుపాల్ కు అప్పజెప్పి జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు అనంతరం అంకాలయ్య మాట్లాడుతూ పది రోజులు నాకు దగ్గరుండి తల్లిదండ్రులు లేని లోటు లేకుండా సేవచేశారన్నారు నారాయణరెడ్డి అన్న పక్కనే ఉన్నన్ని రోజులు కొండంత ధైర్యంగా ఉండేదని నాకు ఆపరేషన్ చేసినమత్తులో ఉన్నప్పుడు నాకు సకల సేవలు చేసినందుకు మలమూత్రాలు కూడా శుభ్రం చేశారని తెలిపారు బి యస్ నారాయణరెడ్డి ఎవరొకూడా నాకు తెలియదు ఆయన రుణం జన్మ జన్మకు తీర్చుకోలేనని కృతజ్ఞతలు తెలిపిన అంకాలయ్య వారి బంధువులు గ్రామస్తులు కూడా మా అంకాలయ్య ఎస్టీ ఎరుకలకు సేవలు చేసినందుకు ఆయనకు ఆరోగ్యం ఆనందాన్ని మనోధైర్యాన్ని ఇచ్చి ఆయన సేవలు కొనసాగేలా చూడాలని దేవ దేవుణ్ణి ప్రకృతిని వేడుకుంటున్నామన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *