తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, పొన్నలూరు పోలీస్ స్టేషన్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను గుర్తించి బాధితుడికి అప్పగించారు.అదేవిధంగా మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో దోర్నాల పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను గుర్తించి రికవరీ చేసి బాధితుడికి అందజేశారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో లేదా సంబంధిత వేదికల ద్వారా ఫిర్యాదు నమోదు చేస్తే సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వాటిని గుర్తించి బాధితులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల ఆస్తులను కాపాడడం, బాధితులకు సత్వర సేవలు అందించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.