ప్రకాశం జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై ఈ-చలాన్లు (e-Challans) విధిస్తూ, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ఐఎస్‌ఐ ప్రమాణాలు కలిగిన హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపే వారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు. అలాగే అతివేగం, తప్పు దిశలో ప్రయాణం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఉల్లంఘించడం వంటి చర్యలు ప్రమాదాలకు ప్రధాన కారణమని వివరిస్తున్నారు.రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి వాహనదారు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, తన భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పోలీసులు పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *