తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం, నాణ్యమైన ఆహారం అందడం లేదని విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని, పోషకాహారం అందించాలని ఆదేశిస్తూ, నిర్లక్ష్యానికి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.