తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :-
ఆర్థిక స్థోమత లేక తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఒక వరమని కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పేర్కొన్నారు. నెల్లూరులోని వి.పి.ఆర్ కార్యాలయంలో శుక్రవారం కోవూరు, కొడవలూరు మండలం, తలమంచి, తుమ్మలవారితోపు ఎస్టీ కాలనీకి చెందిన నంబూరు అంజమ్మకు రూ. 1,50,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసీ (Letter of Credit)ను ఎమ్మెల్యే గారు అందజేశారు. అంజమ్మ కొంతకాలంగా రెండు కాళ్లలో తీవ్రమైన రక్తనాళాల వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి తీవ్రత దృష్ట్యా వైద్యులు ఆమె రెండు కాళ్లకు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. బాధితురాలి కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, వైద్య ఖర్చుల కోసం వారు కోవూరు ఎమ్మెల్యే గారిని ఆశ్రయించి తమ బాధను చెప్పుకున్నారు. ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి, బాధితురాలికి సహాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయానికి సిఫార్సు లేఖ పంపారు. ఎమ్మెల్యే గారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం నుంచి రూ. 1,50,000 ల ఎల్ఓసీ (Letter of Credit) మంజూరైంది. తమకు అండగా నిలిచిన ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సకాలంలో ఆర్థిక సహాయం అందేలా చొరవ తీసుకున్న ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి నంబూరు అంజమ్మ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.