తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు పెండింగ్‌లో ఉన్న UI (Undetected Investigation) కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో అధికారులు స్వయంగా పాల్గొని, సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి పెండింగ్‌లో ఉన్న ప్రతి UI కేసును సమగ్రంగా సమీక్షించారు.కేసుల దర్యాప్తులో ఉన్న పురోగతి, సేకరించిన ఆధారాలు, సాంకేతిక ఆధారాల వినియోగం, అనుమానితుల గుర్తింపు, పెండింగ్‌లో ఉన్న దర్యాప్తు అంశాలు, ఫోరెన్సిక్ నివేదికలు, సీసీటీవీ ఫుటేజీ, డిజిటల్ సాక్ష్యాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి, ప్రతి కేసును త్వరగా ఫైనలైజ్ చేయడానికి అవసరమైన దిశానిర్దేశాలు అందించారు.దర్యాప్తు నాణ్యతను మరింత మెరుగుపరుస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసులను వేగవంతంగా ఛేదించాలని, నేరస్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్యతగా తీసుకుని, ప్రతి కేసుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.బాధితులకు సత్వర న్యాయం అందించడం, పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడం, దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకత, సమర్థత పెంపొందించడం, ప్రజల్లో పోలీసు శాఖపై మరింత విశ్వాసాన్ని పెంచడం ఈ ప్రత్యేక డ్రైవ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.ప్రకాశం జిల్లా పోలీసులు నేరాల నియంత్రణ, సమర్థవంతమైన దర్యాప్తు, బాధితులకు న్యాయం అందించడం మరియు ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నారు.