తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
వర్షం వస్తే గుడ్లూరు మండలంలో రాళ్లవాగు పరిస్థితి అందరికీ తెలిసిందే. చిన్న వర్షానికే గుడ్లూరు–తెట్టు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవి. చెమిడిదపాడు–పోట్లూరు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు.ఈ సమస్యకు శాశ్వత పరిషారం అందించాలనే సంకల్పంతో రూ .2 కోట్లతో నిర్మిస్తున్న రాళ్లవాగుపై బ్రిడ్జి కి ఆదివారం శంకుస్థాపన చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ వంతెన పూర్తయితే వర్షాకాలం లోనూ ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదు. విద్యార్థులకు, రైతులకు అత్యవసర సేవలు సైతం సులభంగా అందుబాటులోకి వస్తాయి.