తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో, జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్ ద్వారా టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ మద్యం సేవించడం, ఓపెన్ బూజింగ్ జరుగుతున్న ప్రాంతాలపై అత్యాధునిక డ్రోన్ సాంకేతికతతో ప్రత్యేక నిఘా నిర్వహించారు.ప్రజలకు ఇబ్బందులు కలిగించే బహిరంగ మద్యం సేవించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలు, చట్టవిరుద్ధ చర్యలను గుర్తించి అరికట్టేందుకు డ్రోన్ సర్వైలెన్స్ చేపట్టబడింది. ప్రజా ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ప్రజలు తమ పరిసరాల్లో బహిరంగ మద్యం సేవించడం లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను గమనించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.