తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం సమీరపాలెం గ్రామంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు, ఐఏఎస్ ఆధ్వర్యంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించబడింది.ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తూ, గ్రామాల అవసరాలను గుర్తించి వేగవంతమైన పరిష్కారానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోంది.’పల్లె నిద్ర’ కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు… ప్రజలతో ప్రభుత్వం మమేకమవుతున్న సుపరిపాలనకు ప్రతీక. ప్రజల సమస్యలను ప్రజల మధ్యే తెలుసుకొని, వాటి పరిష్కారానికి బాధ్యతాయుతంగా చర్యలు తీసుకుంటుంది.