మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఆధ్యాత్మికంగా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అందరివాడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ జి హెచ్ ఆర్ ఏ సి సి పి సి ఐ టి హ్యూమన్ రైట్స్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గ్లోబల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ జర్మనీ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ వారిచే గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా బొమ్మరిల్లు ఫర్నిచర్ షాప్ యజమాని పాపిజన్ని చంద్రశేఖర్ రెడ్డి స్నేహితుల ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు గౌరవ ముత్తుముల అశోక్ రెడ్డి చే పూలమాల శాలువా వేసి ఘనంగా సత్కరించారు. గౌరవ డాక్టరేట్ అవార్డ్ ను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కి చూపించారు. ఆయన మాట్లాడుతూ కడప జిల్లా మిద్దెల గ్రామం నుండి వచ్చి గిద్దలూరు లో ఏళ్ల తరబడి ఆధ్యాత్మికంగా గిద్దలూరు లో మంచి కార్యక్రమాలు చేస్తూ అందరిని కలుపుకొని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక గురువు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ శిష్యులుగా సేవ చేయడం గొప్ప విషయమన్నారు ప్రతి మనిషి దగ్గర మన్ననలను పొందుతున్న నారాయణరెడ్డిని సత్కరించడం అభినందనీయమన్నారు. అందరం ముందుండి సేవా కార్యక్రమాలను నడిపిద్దామని తెలిపారు. నన్ను గుర్తించి సత్కరించినందుకు గిద్దలూరు శాసనసభ్యులు ప్రియతమ నాయకులు గౌరవ ముత్తుముల అశోక్ రెడ్డి కి చాలా చాలా కృతజ్ఞతలు. సత్కారానికి ఏర్పాటుచేసిన బొమ్మరిల్లు ఫర్నిచర్ షాప్ యజమాని పాపిజెన్ని చంద్రశేఖర్ రెడ్డి గిద్దలూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి కి ప్రముఖ పుణ్యక్షేత్రమైన పురాతన శివాలయం నాగేశ్వర స్వామి దేవాలయం వైస్ చైర్మన్ గంట క్రిష్ణారెడ్డికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరపున కృతజ్ఞతలు బి యస్ నారాయణరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణబాబు , దప్పిలి కాశిరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, రాచర్ల మండల టిడిపి పార్టీ అధ్యక్షులు కటిక యోగానంద్ నంది శీను, కాంట్రాక్టర్ కొమరోలు డాడీ, సొసైటీ బ్యాంక్ చైర్మన్ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు బాల ఈశ్వరయ్య, రిటైడ్ లెచ్చరర్ మానవత జిల్లా కన్వీనర్ పాలుగుల్ల శివారెడ్డి, టిడిపి నాయకులు కార్యకర్తలు అధికారులు అనధికారులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *