పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి.. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి.
డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై కఠిన చర్యలు.. ట్రాఫిక్ /రోడ్డు భద్రత నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవాలి.
ఎన్ఫోర్స్మెంట్ ముమ్మరం చేయాలి.. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలి.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
మార్కాపురం జిల్లా పోలీస్ శాఖ ప్రజా భద్రత, సమస్యల పరిష్కారంలో సమర్థవంతంగా పనిచేస్తోంది.
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా కనిగిరి సబ్‌డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, చట్టాల సమర్థవంతమైన అమలుపై జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గారు సోమవారం కనిగిరి పోలీస్ స్టేషన్ కార్యాలయంలో డీఎస్పీ, సీఐలు, ఎస్సైలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ (యూఐ) కేసుల పరిష్కారం, నూతన చట్టాల అమలు, మాదకద్రవ్యాల నియంత్రణకు చేపడుతున్న చర్యలు, శాంతిభద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై జిల్లా ఎస్పీ గారు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నాణ్యమైన విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వారి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ఎన్ఫోర్స్మెంట్ ను ముమ్మరంగా నిర్వహించాలని ఆదేశించారు. చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచి, వాటిని అరికట్టాలని సూచించారు.గంజాయి, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, వారిని బైండ్ ఓవర్ చేయాలనీ, బైండవర్ ఉల్లఘించిన వారిపై తగ్గు చర్యలు తీసుకోవాలన్నారు. దేవాలయాలు/ప్రార్థన మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా మరియు ప్రత్యేక నిఘా కూడా ఉంచాలని అధికారులను జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు ప్రతి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, చట్టాలు, శిక్షలపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా వ్యాప్తంగా కుంభాకార దర్పణాలు (Convex Mirrors) ఏర్పాటు చేసినట్లు పేర్కొంటూ, జాతీయ రహదారిపైకి ప్రవేశించే ముందు వాహనదారులు తప్పనిసరిగా వాహనాన్ని ఆపి ఇరువైపులా పరిశీలించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ ధరించాలని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు.కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించి, కేసుల దర్యాప్తు, స్టేషన్ రికార్డుల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని అధికారులను ఆదేశించారు. కనిగిరి సబ్‌డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో యూఐ, ప్రాపర్టీ, మిస్సింగ్ కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ సంతృప్తికరంగా ఉన్నట్లు తెలిపారు.ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించడంతో పాటు, నేర నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు.ఈ కార్యక్రమంలో కనిగిరి ఇంచార్జ్ డిఎస్పీ పి.శ్రీధర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు,డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, పామూరు సీఐ వినోద్ కుమార్, కనిగిరి ఎస్సై సందీప్ సబ్ డివిజన్ ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.