తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా పోలీసు మరియు మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఈగిల్ టీమ్ సభ్యులతో కలిసి మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా “No Drugs, No Tension” నినాదంతో ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించి, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.అలాగే గంజాయి నివారణ, మహిళలపై నేరాల నిరోధం, బాల్య వివాహాల నిర్మూలన, సైబర్ మోసాల నుంచి రక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ, చైన్ స్నాచింగ్ వంటి నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద మాదకద్రవ్యాల కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.