గ్రామ పంచాయతీ ల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వచ్ఛ గ్రామ పంచాయతీ కార్యక్రమాన్ని ఇంటింటికి చేర్చి అవగాహన కల్పించాలని పర్యవేక్షించాలని ఒంగోలు డి ఎల్ పి ఒ పద్మ గ్రామ పంచాయతీ గ్రీన్ అంబాసిడర్ లు, పి డి ఒ లకు సూచించారు. మంగళవారం సింగరాయకొండ, మూలగుంట పాడు గ్రామ పంచాయతీ ల లో చేపట్టిన పరిశుధ్య పనుల పర్యవేక్షణ పరిశీలన కార్యక్రమం లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి ఎల్ పి ఒ పద్మ సిబ్బందిని గురించి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రతి అధికారి, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొని స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని కోరారు. గ్రామం లో రోడ్ల కి ఇరువైపుల పేరుకు పోయిన చెత్తని ఎప్పటికప్పుడు శుభ్రం చెయ్యాలని సంబంధిత పి డి ఒ లు పర్యవేక్షించాలన్నారు. అదేవిధంగా చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాల లో ఏర్పాటు చేసిన యంత్ర పరికరాలను ఉపయోగించే చెత్తను, వ్యర్థాలను విభజన చేసి ఎరువును సృష్టించాలన్నారు. ప్రజల నుండి వ్యర్థాలను సేకరించి ప్రజలకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే అత్యవసర వస్తువులు ప్రజలకు అంద చెయ్యీ లన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం లో ఇంచార్జి మండల అభివృద్ధి అధికారి, జి ఎస్ డబ్ల్యూ వెంకట్రావు, ఉప మండల అభివృద్ధి అధికారి శారద,మూల గుంట పాడు, సింగరాయకొండ, గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు,గ్రామ పంచాయతీ ల సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *