చినలాటరిపి గ్రామంలో ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-
రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని గుడ్లూరు మండలం చినలాటరిపి గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించగా…. గౌరవ శాసనసభ్యులు *ఇంటూరి నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు. స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలో ప్రచారం నిర్వహించగా… కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రెండు సంవత్సరాలలో రాష్ట్రంతో పాటు కందుకూరు నియోజకవర్గం మరియు చినలాటరిపి పంచాయితీలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని గొప్పగా పరిపాలన అందిస్తున్నామని చెప్పారు. పంచాయతీలో సుమారు 60 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, బోర్లు, జీఎస్పీ రోడ్లు నిర్మించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే 40 మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సహాయం అందించామన్నారు. గుడ్లూరు – నరసాపురం మధ్య 11 కిలోమీటర్ల దూరం కొత్తగా రోడ్డు నిర్మాణానికి 4.30 కోట్లు మంజూరు చేయించానని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. టెండర్లు పూర్తయ్యాయని, నెలరోజులులోపే పనులు మొదలు పెడతారని ఆయన వెల్లడించారు. వైసిపి హయాంలో జరిగిన విధ్వంసాన్ని, కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్ద ఎత్తున జరుగుతున్న పురోగతిని ఎమ్మెల్యే వివరించారు. రాజధాని అమరావతి అత్యద్భుతంగా తయారవుతోందని, వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తారని చెప్పారు. మన ప్రాంతానికి సాగు, తాగునీరు అందించే వెలిగొండ ప్రాజెక్టు పనులు కూడా త్వరలోనే పూర్తి కాబోతున్నాయని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. మన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వార్డులు, పంచాయతీలు కైవసం చేసుకునేలా కూటమి పార్టీ నేతలు పనిచేయాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కాపులూరి ప్రసాద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేకల విజయ, క్లస్టర్ ఇన్చార్జిలు చిత్తారు మల్లికార్జున, ఉమ్మనేని సుబ్బారావు, స్థానిక నాయకులు మేకల మాల్యాద్రి, నూతలపాటి తిరుపతి వెంకయ్య, చిట్యాల యానాది, కాపులూరి విజయ్, ఏసుదాసు, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు జొన్నలగడ్డ రమణమ్మ, యూనిట్ ఇంచార్జ్ పోలుగంగు కృష్ణ, అన్ని గ్రామ పార్టీల అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.