మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గిద్దలూరు పోలీసులు కె.ఎస్. పల్లిలోని సురేష్ క్రాకర్స్ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు.తనిఖీల సందర్భంగా బాణాసంచా నిల్వ విధానం, అగ్నిమాపక పరికరాల అందుబాటు, అత్యవసర భద్రతా ఏర్పాట్లు, లైసెన్స్ నిబంధనల అమలు తదితర అంశాలను పరిశీలించారు. ప్రమాదాలు జరగకుండా అన్ని భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని గోదాం యాజమాన్యానికి పోలీసులు సూచించారు.ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *