తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ సర్వైలెన్స్ (Drone Surveillance) నిర్వహించారు.ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, జూదం ఆడటం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను గుర్తించేందుకు పోలీసులు డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా చేపట్టారు. అనుమానాస్పద ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాలు, జూదం జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా పర్యవేక్షణ నిర్వహించారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి మరియు ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే ప్రకాశం జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం.