ప్రకాశం జిల్లా ఎస్పీ , గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు.గూడ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పొట్లూరు గ్రామం, ఒంగోలు-2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తూర్పుపాలెం, ఈస్ట్ క్రిస్టియన్ పేట, క్రిస్టియన్ పాలెం, ఇందుర్తి నగర్ ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. అద్దెకు నివసిస్తున్న వ్యక్తుల వివరాలు, ఇళ్లను, అనుమానిత వ్యక్తులను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఒంగోలు-2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 మంది ఎస్‌ఐలు, 27 మంది పోలీస్ సిబ్బందితో నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్‌లో అనుమానిత వ్యక్తులు, ఇళ్లు, సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను తనిఖీ చేసి 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 37 వాహనాలను అదుపులోకి తీసుకోగా, అందులో 35 బైక్‌లు, 2 ఆటోలు ఉన్నాయి.
అదేవిధంగా గూడ్లూరు మండలం పొట్లూరు గ్రామంలో “No Drugs” నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు-2 టౌన్ పోలీసులు Eagle Teamతో కలిసి గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి మరియు ఇతర డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *