12న జాతీయ లోక్ అదాలత్ – సద్వినియోగం చేసుకోవాలని సివిల్ జడ్జి డా.వి.లీలా శ్యాంసుందరి సూచన
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సింగరాయకొండ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాంసుందరి సూచించారు. జాతీయ లోక్ అదాలత్ నిర్వహణకు సంబంధించి మంగళవారం సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టు పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల లకు చెందిన సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్‌లో పరిష్కరించదగిన కేసులను గుర్తించి, సంబంధిత పక్షాలతో సమన్వయం చేసుకుని రాజీ మార్గంలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాల అంగీకారంతో కేసులను త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని, తద్వారా కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు దీర్ఘకాలంగా కొనసాగుతున్న న్యాయ వివాదాలకు ముగింపు లభిస్తుందని న్యాయమూర్తి తెలిపారు.కక్షిదారులు తమ కేసుల పరిష్కారం కోసం సంబంధిత న్యాయవాదులను సంప్రదించి, 12-09-2026న జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో పాల్గొని రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని ఆమె కోరారు.సమావేశంలో కోర్టు పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల సర్కిల్ ఇన్స్పెక్టర్లు , సబ్ ఇన్స్పెక్టర్లు మరియు కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.