మహిళలు, బాలికల భద్రతే లక్ష్యంగా టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో కాలేజ్ రోడ్డులో ఈవ్ టీజింగ్ నివారణకు ప్రత్యేక డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు. విద్యార్థినులు, మహిళలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.మహిళలు, బాలికలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈవ్ టీజింగ్, వేధింపులు లేదా అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.మహిళల భద్రతకు ప్రాధాన్యత – ఈవ్ టీజింగ్‌కు నో ఎంట్రీ!
ప్రజలు, విద్యార్థులు ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని పోలీసులు సూచించారు.