పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన ఒంగోలు వన్ టౌన్ లో విధులు నిర్వహిస్తున్న కె.బాబురావు (ఏఎస్ఐ 1825), సర్వీసు 33 సంవత్సరాలు, జిల్లా ఎఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న యస్. ఏసోబు ARHC.2120,సర్వీస్-43 సంవత్సరాలు లను మంగళవారం ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) యుగంధర్ బాబు తో పాటు ఏఆర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు గార్లు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలతో సత్కరించి, వెండి జ్ఞాపికలను అందజేసి ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు.అడిషనల్ ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీసు శాఖలో చేరిన నాటి నుంచి ప్రజలకు సేవ చేస్తూ గౌరవప్రదంగా ఉద్యోగ విరమణ పొందడం గొప్ప అదృష్టమన్నారు. పోలీసు విధుల నిర్వహణలో కుటుంబానికి దూరంగా ఉండి జిల్లా పోలీసు శాఖకు అందించిన సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని తెలిపారు. సకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకుంటామని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ మిగిలిన జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా మీరు పోలీసు కుటుంబంలో సభ్యులేనని, భవిష్యత్తులో వారికి ఏ సహాయం కావాలన్నా పోలీస్ శాఖ ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన సిబ్బంది కుటుంబ సభ్యుల యోగక్షేమాలు, పిల్లల విద్య, ఉద్యోగ వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ సీతారామి రెడ్డి, ఆర్ఎస్సై తిరుపతి స్వామి, పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *