తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ లోని శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ నందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయుల్ని, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. పాఠశాల కరస్పాండెంట్ సైకం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. గురువులను గౌరవిస్తూ వారు చూపిన మార్గంలో నడిచి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడమే గురువులకు ఇచ్చే నిజమైన గౌరవమని తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను స్మరించుకొని నివాళులర్పించారు. హైస్కూలు హెడ్మాస్టర్ సైకం శ్రీవిద్య మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు,దేశభక్తి పెంపొందించుకొని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.
