తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
వెన్నూరు గ్రామంలో జూదం ఆడుతున్న ఆరుగురు వ్యక్తుల అదుపులోకి – రూ.7,810 నగదు స్వాధీనం వెన్నూరు గ్రామంలో అక్రమంగా జూదం నిర్వహిస్తున్నారనే సమాచారంతో కొండేపి పోలీసులు ప్రత్యేకంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 6 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి జూదానికి వినియోగిస్తున్న రూ.7,810/- నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్రమ జూదం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గ్రామాల్లో ఎక్కడైనా జూదం లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కొండేపి పోలీసులు సూచించారు.