జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక రోడ్‌ సేఫ్టీ రెక్టిఫికేషన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. జిల్లాలో గుర్తించిన బ్లాక్‌ స్పాట్లు, యాక్సిడెంట్‌ ప్రోన్‌ ఏరియాలు, ప్రమాదకర జంక్షన్లు, యూ-టర్న్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టారు.ప్రమాద ప్రాంతాల్లో వాహనదారులను అప్రమత్తం చేసేందుకు వైట్‌ రోడ్‌ మార్కింగ్స్‌, పెయింటింగ్‌ మార్క్స్‌ ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో రహదారి స్పష్టంగా కనిపించేలా NH-565లోని బ్లాక్‌ స్పాట్‌ ప్రాంతాల్లో రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేశారు.అదేవిధంగా NH-544Dపై ఉన్న షార్ప్‌ ఎడ్జ్‌ “U” టర్న్‌ వద్ద రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేసి రాత్రి సమయంలో విజిబిలిటీని పెంచి, వాహనదారులను ముందుగానే అప్రమత్తం చేసే చర్యలు చేపట్టారు. దీంతో వాహనాల వేగాన్ని నియంత్రించి ప్రమాదాల నివారణకు తోడ్పడేలా చర్యలు తీసుకున్నారు.బ్లాక్‌ స్పాట్ల వద్ద రహదారి పక్కన పార్క్‌ చేసిన వాహనాలను తొలగించి, వాహనదారులకు మెరుగైన విజిబిలిటీ కల్పించారు. జంక్షన్ల వద్ద కన్వెక్స్‌ మిర్రర్లను సరైన స్థానంలో సర్దుబాటు చేసి ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించేలా చర్యలు చేపట్టారు.రోడ్డు పక్కన పెరిగిన పొదలు, చెట్ల కొమ్మలను తొలగించి, రహదారి విజిబిలిటీని మెరుగుపరిచారు. ప్రమాద ప్రాంతాల్లో వాహనదారులను అప్రమత్తం చేసేందుకు అవసరమైన గుర్తులు, సూచనలు ఏర్పాటు చేస్తూ రోడ్డు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేశారు.అలాగే ప్రమాద ప్రాంతాల్లో వాహనదారులు వేగాన్ని తగ్గించి, రహదారి సూచనలు పాటిస్తూ, అప్రమత్తంగా ప్రయాణించాలని పోలీసులు అవగాహన కల్పించారు.ప్రమాదాల నివారణ – సురక్షిత ప్రయాణం – ప్రజల భద్రతే మార్కాపురం జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *