ప్రశ్నించే తత్వం,శాస్త్రీయ దృక్పధమే సమాజాన్ని ముందుకు నడిపిస్తాయని
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ జయప్రకాష్ అన్నారు. టంగుటూరు లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు శుక్రవారం జరిగిన మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలలో ఆయన మాట్లాడుతూ చిన్ననాటి నుండే విద్యార్థులకు మూఢనమ్మకాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, సైన్స్ పట్ల ఆసక్తిని- ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేందుకు, విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు జెవివి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తోందని తెలిపారు. జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు ఈనెల 27 న అద్దంకి లో జరుగనున్నాయనీ,మండల
స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విభాగాలలో మొదటి స్థానం సాధించిన విద్యార్థి బృందాలు ఇందులో పాల్గొనాలని జయప్రకాష్ కోరారు. టంగుటూరు మండల స్థాయి చెకుముకిలో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో జడ్పీహెచ్ఎస్ ఆలకురపాడు ప్రైవేటు పాఠశాలల విభాగంలో శ్రీ చైతన్య హై స్కూల్ విద్యార్థి బృందాలు ప్రథమ స్థానం సాధించారు.టంగుటూరు-ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె. వెంకటేశ్వర్లు మొదటి స్థానం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పి. నారాయణ, బి. అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *