తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ లో శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని జయంతి అత్యంత వైభవంగా జరిగినది.ముందుగా బ్రహ్మంగారి గుడి నుంచి మేళతాళాలతో, డప్పు వాయిద్యాలతో ఊరేగింపు జరిగింది. అనంతరం శాస్త్ర యుక్తంగా భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. కార్యక్రమంలో అనంతరం విశ్వకర్మ భగవాన్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. కార్యక్రమంలో మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.