ఆకాశం నుంచి నిరంతర పర్యవేక్షణ – నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు గణేష్‌ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో రామాయపట్నం, అలగాయపాలెం నిమజ్జన ప్రాంతాల్లో ప్రకాశం జిల్లా పోలీసులు డ్రోన్‌ సర్వైలెన్స్‌ నిర్వహించారు. నిమజ్జన ప్రాంతాలు, శోభాయాత్రల మార్గాలు, భక్తుల రాకపోకలు, వాహనాల రద్దీ తదితర అంశాలను డ్రోన్‌ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించారు.నిమజ్జన ప్రాంతాల్లో ప్రజల భద్రత, జనసమ్మర్థం నియంత్రణ, ట్రాఫిక్‌ నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపడుతూ, అవసరమైన ప్రాంతాల్లో పోలీసు సిబ్బందిని సమన్వయంతో విధుల్లో ఉంచారు.టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్‌లో భాగంగా డ్రోన్‌ నిఘాను వినియోగిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసి, అవసరమైన చోట వెంటనే స్పందించేలా పోలీసు అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.భక్తులు, ఉత్సవ నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని పోలీసులు కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *