ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ గారు సత్యనారాయణపురం, దిబ్బల రోడ్, 60 ఫీట్ రోడ్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని వినాయక విగ్రహ మండపాలను సందర్శించి, నిర్వాహకులతో మాట్లాడి గణేష్ ఉత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సూచనలు చేశారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని, పోలీసుల సూచనలు మరియు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు తెలిపారు.ప్రజలకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు ఒంగోలు తాలూకా పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ మరియు నిఘా కొనసాగిస్తున్నారు.ప్రశాంతమైన గణేష్ ఉత్సవాలే లక్ష్యం – ప్రజల భద్రతకు ప్రకాశం పోలీసులు నిరంతరం అప్రమత్తం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *