శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి సేవలో నిమగ్నమై భక్తిశ్రద్ధలతో విధులు నిర్వహిస్తున్న సుమారు 5,000 మంది టీటీడీ సిబ్బందికి వస్త్ర బహుమానం అందించడం ఎంతో సంతోషంగా ఉంది. ఆలయ అర్చకులు, పోటు సిబ్బంది, వాహన బేరర్లు, మంగళవాయిద్య బృందం, కల్యాణకట్ట సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్ట్రిసిటీ విభాగం ఉద్యోగులు తదితరుల సేవలను గౌరవిస్తూ ఈ వస్త్ర బహుమానం అందించాం.శ్రీవారి సేవలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు.గత 8 ఏళ్లుగా బ్రహ్మోత్సవ సేవకులకు వస్త్ర బహుమానం అందించే ఈ సేవను నిరంతరాయంగా కొనసాగిస్తున్నాం. భవిష్యత్తులోనూ స్వామివారి సేవలో మా వంతు బాధ్యతను కొనసాగిస్తాం.శ్రీ వేంకటేశ్వర స్వామివారి కృపాకటాక్షాలు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *