తొలి శుభోదయం న్యూస్ దర్శన నియోజకవర్గం:-
దర్శి పట్టణం అద్దంకి రోడ్డులోని 19వ వార్డు పుచ్చలమెట్టు వద్ద నెలకొల్పిన వినాయకుని విగ్రహం వద్ద దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ – లలిత్ సాగర్ దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షులు పుల్లలచెరువు సత్యనారాయణ, దారం కొండ, తిరుమల వెంకీ (బిర్లా), ఉల్లి పిచ్చయ్య, కొట్టె పెద్ద మల్లి ఖార్జున రావు తదితర టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.విఘ్నాలు తొలగించి… దర్శి ప్రజలందరికీ సుఖసంతోషాలు ప్రసాదించాలని వినాయకుడిని ప్రార్థించారు.