ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారంతో పాటు అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర పరిహారం అందించాలని, దాడులు–దౌర్జన్యాలకు పాల్పడిన వారికి త్వరగా శిక్ష పడేలా విచారణలను వేగవంతం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు.ప్రకాశం భవన్‌లో కలెక్టర్ పి. రాజాబాబు అధ్యక్షతన జరిగిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ ఏడాది ప్రకాశం జిల్లాలో 58 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, వాటిలో 9 కేసులు కోర్టుల్లో విచారణలో ఉన్నాయని మంత్రి తెలిపారు. మిగతా కేసుల్లో ఛార్జ్‌షీట్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, రాష్ట్రంలో 600 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు IIT, NEET లక్ష్యంగా కార్పొరేట్ సంస్థల ద్వారా బోధన అందిస్తున్నట్లు తెలిపారు. ఒంగోలులో అంబేద్కర్ స్టడీ సర్కిల్ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నైపుణ్యాభివృద్ధి, UPSC పోటీ పరీక్షలు, ఉపాధి అవకాశాల కోసం శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు.స్మశాన స్థలాల సమస్య ఉన్న గ్రామాలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను నెల రోజుల్లోగా కేటాయించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల మూడో సోమవారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల దర్యాప్తును త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ కేసుల దర్యాప్తు, శిక్షల విషయంలో ప్రకాశం జిల్లా రాష్ట్రంలోని టాప్-5 జిల్లాల్లో ఉందని తెలిపారు.సమావేశంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *