తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :-
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ద్వారా రూ.22 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో భాగంగా మున్సిపాలిటీలో రోడ్లు, సెంట్రల్ మీడియన్లు, లైటింగ్ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది.
నెల్లూరు జిల్లాకు ‘హ్యామ్’ కింద రూ.380 కోట్ల నిధులు మంజూరు చేయడం అభినందనీయం. బుచ్చిరెడ్డిపాళెం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతూ నిధులు కేటాయించిన మున్సిపల్ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.ఇప్పటికే బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలో దాదాపు రూ.68 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాం. తాజాగా మంజూరైన రూ.22 కోట్లతో కలిపి మొత్తం దాదాపు రూ.90 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధికి మరింత వేగం అందనుంది.బుచ్చిరెడ్డిపాళెం పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన రహదారులు, సెంట్రల్ మీడియన్లు, లైటింగ్‌తో పాటు మెరుగైన మౌలిక వసతులు మరియు సౌకర్యాలు అందించడమే మా కూటమి ప్రభుత్వం లక్ష్యం.బుచ్చిరెడ్డిపాళెం అభివృద్ధికి నిరంతరం సహకరిస్తూ అవసరమైన నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మున్సిపల్ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.