తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరు డివిజన్ పరిధిలోని గుండ్లకమ్మ రేంజ్, రాచెర్ల సెక్షన్, అంబవరం బీట్‌లోని ENB-I రిజర్వ్ ఫారెస్ట్‌లో చుక్కల దుప్పిని ఉచ్చులు బిగించి వేటాడిన కేసులో ముగ్గురు వ్యక్తులను అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు.
అటవీశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గోగుల శ్రీను, భూపాని శ్రీ వెంకట లక్ష్మీ నారాయణ, గుర్రం పెద్ద గురవయ్యలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం వారిని గిద్దలూరు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులను ప్రకాశం జిల్లా ఒంగోలు డిస్ట్రిక్ట్ జైలుకు తరలించారు.
చుక్కల దుప్పి వన్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం అత్యంత రక్షణ కలిగిన జాబితాలో ఉందని అటవీశాఖ అధికారులు తెలిపారు. చుక్కల దుప్పిని వేటాడటం, చంపడం తీవ్రమైన నేరమని హెచ్చరించారు. అటవీ ప్రాంతాల్లో అక్రమ వేటకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.