పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని 16వ నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 ఏళ్ల యువకుడు మృతి చెందాడు.పోలీసుల వివరాల ప్రకారం, సింగరాయకొండ గోపాల్‌నగర్‌కు చెందిన అడకా మహేంద్ర (18) బేల్దారి మేస్త్రీగా పనిచేస్తున్నాడు. పనిమీద తోటి మేస్త్రీని ఫ్యాక్టరీ వద్ద దించి తిరిగి ఇంటికి వస్తుండగా, లారీ యూనియన్ కార్యాలయం సమీపంలో ఒంగోలు వైపు నుంచి రాంగ్‌రూట్‌లో వచ్చిన లారీ అతని ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేంద్రను హైవే అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.సమాచారం అందుకున్న హైవే, సింగరాయకొండ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎస్సై ఎల్. సుధీర్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *