తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :-
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అందాలను సైక్లింగ్ ద్వారా అన్వేషిస్తూ, 14 జిల్లాల మీదుగా 25 రోజుల పాటు 1,700 కిలోమీటర్ల సైకిల్ ప్రయాణంతో “AP లెటర్ టూర్” అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో, అలాగే కోవూరు నియోజకవర్గ తొలి మహిళా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి ఈ సైకిల్ యాత్రను అంకితం చేస్తూ ముందుకు సాగుతున్న నెల్లూరు యువకుడు చైతు .ఈ సందర్భంగా ఆదివారం నెల్లూరులో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు “AP లెటర్ టూర్” సైకిల్ రైడ్‌ను జెండా ఊపి ప్రారంభించారు.