బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నాను.9వ వార్డు (పాత 4వ వార్డు) విద్యానగర్‌లో రూ.70 లక్షలతో,20వ వార్డు (పాత 11వ వార్డు) పుట్టవీధిలో రూ.60 లక్షలతో,7వ వార్డు (పాత 13వ వార్డు) ఎస్‌ఎస్ కల్యాణ మండపం వీధిలో రూ.70 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు శ్రీకారం చుట్టాం.అలాగే, బుచ్చిరెడ్డిపాళెం మీదుగా వెళ్లే NH-67 జాతీయ రహదారిని సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ తదితర సదుపాయాలతో మరింత సుందరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు రూ.14.40 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాను.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలో రోడ్లు, సీసీ డ్రెయిన్లు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికే రూ.58 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టాం. తాజాగా HAM పథకం కింద మరో రూ.22 కోట్లు మంజూరు కావడం ఎంతో సంతోషకరం.ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పురపాలక శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి సహకారంతో కోవూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *