“యువత భవితకు భరోసా” కార్యక్రమంలో భాగంగా, గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేడు టి.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ప్రత్యేకంగా ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం: నేటి విద్యార్థులు, నిరుద్యోగ యువతలో భవిష్యత్తుపై ఉన్న ఆందోళనలు, అపోహలు, సందేహాలను తొలగించి వారిలో ఆత్మవిశ్వాసం నింపడం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, స్టార్టప్ మరియు స్వయం ఉపాధి పథకాల గురించి యువతకు అవగాహన కల్పించి, వారి బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇవ్వడమే ఈ కార్యక్రమ లక్ష్యం.యువతతో నేరుగా సంభాషించడం, వారి ఆకాంక్షలను తెలుసుకోవడం మరియు వారి భవిష్యత్తు పట్ల భరోసా కల్పించడం అనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.ముందుగా ఆయన సెమినార్ హాలులో షహీద్ భగత్ సింగ్ మరియు మహాకవి గుర్రం జాషువా గార్ల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం విద్యార్థులతో ఆత్మీయంగా సంభాషించారు. కార్యక్రమం అంతటా విద్యార్థులు పాటించిన క్రమశిక్షణను ప్రత్యేకంగా అభినందించారు. కళాశాలలోని విద్యా వాతావరణాన్ని, హరితహార కార్యక్రమాలను కొనియాడారు.ఈ సందర్భంగా గౌరవ ఎంపీ గారు విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తరగతి గదుల కోసం 40 సీలింగ్ ఫ్యాన్లను VPR ఫౌండేషన్ ద్వారా ఉదారంగా ప్రకటించారు. అంతేకాకుండా, విద్యార్థుల చిరకాల కోరిక అయిన NCC యూనిట్‌ను త్వరలోనే కళాశాలలో పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.గౌరవ ఎంపీ గారు కళాశాల ఆవరణలో అభివృద్ధి చేసిన మియావాకి ఫారెస్ట్ ప్రాజెక్టును సందర్శించి, ఈ వినూత్న హరిత కార్యక్రమాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. విద్యార్థులు, సిబ్బందితో కలిసి ఫోటోలు దిగారు.ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన రసాయన శాస్త్ర అధ్యాపకురాలు డా. కె.వి. పద్మావతి ఆయన ప్రత్యేకంగా అభినందించారు.తన విలువైన సమయాన్ని కేటాయించి విద్యార్థులతో స్ఫూర్తిదాయకంగా సంభాషించి, ఉదారంగా సహాయాన్ని ప్రకటించిన గౌరవ ఎంపీ గారికి ప్రిన్సిపాల్ గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *