తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ అక్టోబర్ 1వ తేదీ ఉదయమే 06.30ని లకు యథావిధిగా ప్రారంభమవుతుందని మున్సిపల్ కమిషనర్ ఈ.వి. రమణబాబు తెలిపారు.బ్యాంకుల సమ్మె కారణంగా పెన్షన్లను అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం నుంచి పంపిణీ చేయాలని తొలుత నిర్ణయించినప్పటికీ, సమ్మె వాయిదా పడటంతో ఉదయం నుంచే పెన్షన్ల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు.గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో 3,247 మంది పెన్షన్దారులకు మొత్తం రూ.1,48,51,000 పంపిణీ చేయనున్నట్లు కమిషనర్ వెల్లడించారు.