మంత్రి డా.డోలా శ్రీ వీరాంజనేయస్వామి సమక్షంలో జరుగుమల్లి మండలం వర్ధినేనివారిపాలెం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. సోమవారం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వారికి పసుపు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం నచ్చి ఇతర పార్టీల వారు టీడీపీలో చేరుతున్నారని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ అండ్ కో దోచుకోవటం దాచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. కూటమి రెండున్నరేళ్ల పాలనలోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకువచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే ప్రభుత్వంపై వైసీపీ నిత్యం అబద్ధాలతో విషం చిమ్ముతోందని మండిపడ్డారు. ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసినా వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై అబద్ధాలు, అసత్యాలతో బురద చల్లే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *