తొలి శుభోదయం న్యూస్ ఉదయగిరి:-
ఉదయగిరి నియోజకవర్గం రామాపురంలో ఈ నెల 29న జరగనున్న “పల్లె పండుగ–3.0” కార్యక్రమం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు గారు, ముత్తముల అశోక్ రెడ్డి గారు, ఉగ్ర నరసింహ రెడ్డి గారు మరియు కూటమి నేతలతో కలిసి పరిశీలించిన రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య సభా వేదిక, భోజన ఏర్పాట్లతో పాటు ఇతర సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది.పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించడం జరిగింది. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది.